20-09-2025 07:25:39 PM
కోదాడ: కోదాడ కె.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల "మండల న్యాయ సేవా అధికార సంస్థ" ఆధ్వర్యంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. న్యాయవాది ఎడ్లవల్లి వెంకటేశ్వర్లు సభాధ్యక్షత స్థానం వహించగా తొలి పలుకులు తెలుగు ఉపన్యాసకులు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు పలుకగాస ముఖ్య అతిథిగా, వక్తగా ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.డి. ఉమర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ, అధ్యాపకులు ఆర్. పిచ్చిరెడ్డి, సామాజిక కార్యకర్త మాలోత్ సైదా నాయక్, న్యాయవాదులు రామిశెట్టి రామకృష్ణ, గట్ల నరసింహారావు, హేమలత, దొడ్డ శ్రీధర్లతో పాటుగా మండల లీగల్ సర్వీస్ అథారిటీస్ మెంబర్స్ జి. మౌనిక, జి. శైలజ, జె.సైదమ్మ, ఎం.డి. మజహర్, దార. యేసోబు పాల్గొన్నారు.