20-09-2025 07:24:37 PM
అమీన్ పూర్: సంగారెడ్డి అమీన్ పూర్ మండలం పటేల్ గూడా, కిష్టారెడ్డి పేట్ గ్రామాల్లో రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ఆధ్వర్యంలో విజయదశమి విజయోత్సవ ఆయుధ పూజా కార్యక్రమం ఘనంగా నర్వహించారు. అమీన్ పూర్ మండలం పటేల్ గూడా బిహెచ్ఎల్ మెట్రో కాలనీలో పంచముఖి హనుమాన్ దేవాలయం ఆవరణలో, కిష్టారెడ్డిపేట్ దుర్గానగర్ కాలనీ ఎలైట్ అపార్ట్మెంట్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం, ఆయుధ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమీన్ పూర్ బిజెపి మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వయంగా ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విజయదశమి పండుగ మన సమాజానికి ఐక్యత, ధర్మపాలనకు ప్రతీక మనం అందరం కలసి సమాజంలో మంచి విలువలను కాపాడుకోవాలి. ధర్మమే గెలుస్తుందనే సత్యాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుందిని, యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందించుకోవడం చాలా ముఖ్యం అన్నారు. వివిధ కాలనీలో గల హిందూ బంధువులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయదశమి ఆయుధ పూజ ఉత్సవాన్ని విజయవంతం చేశారు.