calender_icon.png 20 September, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన హామీలు నెరవేర్చండి

20-09-2025 07:28:38 PM

* పెన్షన్లు పెంచాలని కార్యదర్శి కి వినతిపత్రం అందజేత

* ఎమ్మార్పీఎస్ నాయకులు

ముస్తాబాద్,(విజయక్రాంతి): రిజర్వేషన్ పోరాట సమితి ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామశాఖ అధ్యక్షుడు కొండని బాలకిషన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఆఫర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా బాల కిషన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ.4 వేల నుండి రూ 6 వేలు పెంచుతామని, అలాగే వృద్ధులు వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు రూ 3 వేల నుండి రూ 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారని పేర్కొన్నారు.

కానీ  ముఖ్యమంత్రి పదవీ చేపట్టి 22 నెలలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదని, ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ వికలాంగులకు, వృద్ధులకు,వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారులకు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. దీని వల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని,ప్రస్తుత పెన్షన్ వల్ల నెల రోజుల పాటు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా జీవించే పరిస్థితి కూడా లేదన్నారు. అంగవైకల్యం,నిస్సహాయ స్థితి, నిరాదరణ వల్ల ఇప్పటికే ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటున్న వికలాంగులు, వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల యొక్క దీన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతూ... పోతుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు.