calender_icon.png 25 August, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమర్ మోటార్స్ సేల్స్ & సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవం

25-08-2025 09:55:34 PM

ప్రారంభించిన మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడిపల్లి: పర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన “అమర్ మోటర్స్ సేల్స్ & సర్వీస్ సెంటర్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి  మాజీ మంత్రి, మేడ్చల్ శాసన సభ్యులు చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, పిర్జాది గూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, దొంతిరి హరిశంకర్ రెడ్డి, లేతాకుల మాదవి రఘుపతి రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా  మాట్లాడుతూ  ఈ ప్రాంత  ప్రజలకు వాహనాల విక్రయం, మరమ్మత్తులు, సేవలు ఒకే దగ్గర లభించటం సంతోషకరమని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలిగే విధంగా సెంటర్ అభివృద్ధి చెందాలని అన్నారు. యాజమాన్య సభ్యులు  మాట్లాడుతూ, వినియోగదారులకు అత్యాధునిక సదుపాయాలు, నాణ్యమైన సర్వీసులు అందించడమే తమ లక్ష్యమని, స్థానిక కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు.