calender_icon.png 25 August, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రజా పాలనలోనే గ్రామాల అభివృద్ధి

25-08-2025 09:41:44 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలో లో  తాటిపాముల గ్రామంలో  రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ నిధులతో అంచనా విలువ 20 లక్షల రూపాయలతో  నిర్మించు సిసి రోడ్ల శంకుస్థాపనకు ముఖ్య అతిధులుగా వెచ్చేసిన, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం 1400 కోట్లు నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనతోనే గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయని అన్నారు. అనంతరం మద్దిరాల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు ఐకమత్యంతో పనిచేసి అత్యధిక స్థానాలు గెలుపొందారని కోరారు.