calender_icon.png 25 August, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో యూరియా పంటలకు మేలు: డీఏవో విజయ నిర్మల

25-08-2025 10:00:28 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): సాధారణ యూరియాకు బదులుగా ద్రవ రూపంలో తయారుచేసిన నానో యూరియా వినియోగం వల్ల పంటలకు మేలు చేయడంతో పాటు, రైతులకు ఆర్థిక భారం తగ్గుతుందని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల తెలిపారు. జిల్లాలోని తొర్రూరు పట్టణంలో సోమవారం రైతులకు నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు.

ఒక లీటర్ నానో యూరియా బాటిల్ 45 కిలోల సాధారణ యూరియాకు సమానమని, నానో యూరియాను పూర్తిగా పంట స్వీకరిస్తుందని, అదే సాధారణ యూరియా 40 శాతం మాత్రమే పంటకు ఉపయోగపడుతుందన్నారు. నానో యూరియా వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని, ఇతర పీడపీడల నుంచి కూడా పంటలను కాపాడుతుందని చెప్పారు. రైతులు రెండవ డోసు యూరియాకు బదులు నానో యూరియా వినియోగించేందుకు కృషి చేయాలన్నారు.