16-09-2025 07:55:15 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ పరిధిలోని అడ్లూరు గ్రామంలో మంగళవారం పద్మపాని సొసైటీ , కోర్ కార్బన్ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ సంయుక్తంగా రైతులకు వరిలో తడి పొడి విధానం పైన అవగాహన కల్పించారు. ఈ తడి పొడి విధానం పాటించడం వలన వరిలో మీథైన్ అనే విష వాయువును తగ్గించడం జరుగుతుంది. దీనివలన పర్యావరణాన్ని కాపాడుతాము, అలాగే ఎరువుల వినియోగము సద్వినియోగం అవుతుంది,భూమి కూడా సారవంతం పెరుగుతుంది. నీటి వినియోగం కూడా తగ్గుతుంది దోమపోటు రాదు, పిలకలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. అలాగే రైతులకు ఈ తడి పొడి విధానం పాటించినందుకు రైతులకు ప్రోత్సాహకరంగా advance గా ఎకరానికి 500 రూపాయల చొప్పున రైతులకు పారితోషకం అందజేశారు.