16-09-2025 07:57:08 PM
జిల్లా విద్యుత్ ఉద్యోగులకు అందుబాటులో..
సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఆర్థోపెడిక్ హాస్పిటల్ లో విద్యుత్ ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నట్లు ప్రముఖ కీళ్ల ఎముకల సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ సముద్రాల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సిద్ధిపేట విద్యుత్ శాఖ జిల్లా అధికారి చంద్రమోహన్(Electricity Department District Officer Chandramohan) ఉద్యోగులతో కలిసి శ్రీనివాస ఆర్థోపెడిక్ హాస్పిటల్ వాల్ పోస్టర్స్ విడుదల చేసి మాట్లాడారు. నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్సలు అందించేందుకు డాక్టర్ సముద్రాల శ్రీనివాస్ చేసిన కృషి అభినందనీయం అన్నారు.
సిద్దిపేట జిల్లా విద్యుత్ ఉద్యోగులు పెన్షన్ లబ్ధిదారులు, ఆర్టిజన్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విరిగిన ఎముకలకు, కీళ్ల మార్పిడికి, యూరాలజీ, జనరల్ మెడిసిన్, న్యూరో సర్జరీ, గైనకాలజీ వంటి వ్యాధులకు చికిత్స పొందే అవకాశం ఉందన్నారు. నెలవారి వేతనంపై ఆధారపడిన కుటుంబాలకు నగదు రహిత వైద్య చికిత్సలు అందించడం అదృష్టకరమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈఈలు శ్రీనాథ్, రామచంద్రయ్య, భాను ప్రకాష్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.