03-07-2025 07:58:58 PM
తప్పుడు ప్రచారాలు చేస్తున్న పత్రిక, కొన్ని టీవీ చానల్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం..
కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు...
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండల కేంద్రము నందు కాంగ్రెస్ నాయకులతో కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా, మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జాడి రాంబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎండి అప్సర్ పాషా, జాడి రాంబాబు మాట్లాడుతూ... గత రెండు రోజులుగా ఓ పేపర్ లో ఇంకా కొన్ని టీవీ ఛానల్ లో మంత్రి సీతక్క మీద ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మీద పని కట్టుకుని తప్పుడు ప్రచారాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ శునకానందం పొందుతున్నారని అన్నారు.
గతంలో ములుగు నియోజకవర్గంలో ఎన్నడు లేని విధంగా అభివృధి జరుగుతుంటే ఓర్వలేక ఎక్కడ పడితే అక్కడ తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదని గత మూడు రోజులుగా బీఆర్ఎస్ సొంత పత్రికలో ప్రచురిస్తున్న తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉండే మా నాయకుడు అశోక్ మీద (తుపాకీ రాముడు) అనే నాగన్న పేరుతో ఇష్టం వచ్చిన రీతిలో వార్తలు రాసిన పత్రిక యాజమాన్యం తక్షణమే మా మంత్రీ సీతక్క జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ఆదివాసి ముద్దుబిడ్డ అయిన సీతక్క మంత్రీ అయినందుకు ఓర్చుకోలేక ఇలా చిల్లర రాజకీయాలు చేస్తూ పూట గడుపుతున్నారు అని ఎద్దేవా చేశారు.
మీరు ఎన్ని కుట్రలు చేసిన రానున్న స్థానిక ఎన్నికలలో విజయం కాంగ్రెస్ పార్టీదే అవుతుందని కొనియాడారు.గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి ,స్థానిక జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ కానీ ఒకసారి సందర్శించారా సీతక్క మంత్రి అయిన కూడ మన ఇంటి ఆడపడుచు లాగ ఏ ఇంటికి ఆపద వచ్చిన నేనున్న అని భరోసా ఇచ్చే నాయకురాలు సీతక్క, ప్రజా సమస్యలు ప్రభుత్వానికి సూచన చేసే విధంగా ఉండాలి తప్ప ప్రజా నాయకులపైన దృష్పచారం చేస్తూ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.