03-07-2025 08:03:40 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) సంస్థాన్ నారాయణపూర్ మండల అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. సంస్థాన్ నారాయణపూర్ మండలం అల్లందేవి చేర్వు గ్రామంలో పొలం పనులకు వెళ్ళే రైతుల ఇబ్బందులను గుర్తించి మూడు సంవత్సరాల క్రితం బ్రిడ్జిని నిర్మించారు. బుధవారం కురిసిన వర్షానికి బ్రిడ్జి వద్ద మట్టి కొట్టుకొనిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రాజు గౌడ్ తన స్వంత ఖర్చుతో బ్రిడ్జి మరమ్మత్తు పనులు చేయించారు. గ్రామస్తులు రైతులు రాజుగౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు.