03-07-2025 07:56:04 PM
కోదాడ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు రెవ వి. యేసయ్య..
కోదాడ: స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో ఇండియన్ క్రిస్టియన్ డే(Indian Christian Day) సందర్భంగా యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ కోదాడ నియోజకవర్గ ప్రెసిడెంట్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పాస్టర్ యేసయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ... క్రైస్తవ సువార్త నిమిత్తం యేసు ప్రభువు శిష్యులలో ఒకడైన తోమా మన దక్షిణ భారతదేశానికి క్రీస్తుశకం 52వ సంవత్సరంలో విచ్చేసి కేరళ తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో అనేకమంది సత్య సువార్తను బోధించి రోగులను బాగు చేసి దేశమంతా సువార్తను ప్రకటించాడు.
మొదటి శతబ్దం 72లో హత సాక్షి అయిన ఇండియన్ క్రిస్టియన్ డే గా జరుపుకుంటున్నారు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, అసోసియేషన్ కోఆర్డినేటర్ రెవ సుందర్ రావు, కోదాడ నియోజకవర్గ సెక్రెటరీ రెవ. రాజేష్, కోదాడ పట్టణ ప్రెసిడెంట్ రేవ ప్రభుదాస్, అనంతగిరి మండల ప్రెసిడెంట్ రేవ. డానియల్, అసోసియేషన్ మెంబర్స్ రేవ. సామ్యేల్, రేవ నెహెమ్యా, యువరాజ్, బాబు మోజస్ ఇస్మాయిల్, కిరణ్, సరిత, పాల్గొన్నారు