calender_icon.png 4 July, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ పోలీసులు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి

03-07-2025 07:53:49 PM

ఎస్పీ శరత్ చంద్ర పవార్..

పలువురు హోం గార్డ్స్ కి ఆర్దిక చేయూత..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): వర్షాకాల నేపథ్యంలో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar) అన్నారు. వర్షాకాలం ప్రారంభం నేపధ్యంలో ట్రాఫిక్ పోలీసులు తమ విధి నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బందికి రెయిన్‌ కోట్స్, కండ్ల అద్దాలు, రేడియం రిఫ్లెక్టివ్ జాకెట్స్, గొడుగులు, బూట్లను గురువారం సిబ్బందికి అందజేస్తూ కొన్ని సూచనలు చేశారు. పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు విజిబుల్ పోలీసింగ్ లో ప్రధాన పాత్ర పోషిస్తారని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ విధులు నిర్వర్తించాలని అప్పుడే ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం లభిస్తుందని సూచించారు.

ప్రజల భద్రతలో భాగంగా వారు రోడ్ ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతా, ట్రాఫిక్ రూల్స్ పైన ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలని అన్నారు. తమకి అప్పగించిన ట్రాఫిక్ పాయింట్ వద్ద డ్యూటీ టైమ్ లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ట్రాఫిక్ ను నియంత్రించాలని అన్నారు. వర్షకాలం నేపథ్యంలో  ట్రాఫిక్ నియంత్రణలో, రాత్రిపూట విధుల్లో, బందోబస్తు వంటి విధులను నిర్వహించుటకు ట్రాఫిక్ కిట్స్  సహాయపడుతాయి అన్నారు.

అనంతరం విధినిర్వహణ విధులు నిర్వహిస్తూ చనిపోయిన ముగ్గురు హోం గార్డ్ కుటుంబ సభ్యులకు హోం గార్డ్స్ సంక్షేమ నిదుల నుంచి15 వేల రూపాయలు, అనారోగ్య కారణంగా మెడికల్ చికిత్స పొందిన ఐదుగురి హోం గార్డ్స్ కి 10 వేల రూపాయలు, హోం గార్డ్ పిల్లల మ్యారేజ్ కొరకు ఇద్దరికి 5 వేల రూపాయలు, మెరిట్ స్కాలర్షిప్ క్రింద ముగ్గురికి 5 వేల రూపాయల చెక్ లను జిల్లా ఎస్పీ జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు శాఖలో భాగమై విధి నిర్వహణలో క్రమ శిక్షణా విధులు నిర్వర్తిస్తూన్న హోం గార్డ్స్ సంక్షేమం కొరకు ఎల్లవేళలా కృషి చేస్తానని ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, హరిబాబు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.