calender_icon.png 4 July, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ ను ఐకాన్ లాగా తీర్చిదిద్దండి..

03-07-2025 08:14:37 PM

కలెక్టర్ ను కోరిన వెలిచాల రాజేందర్ రావు..

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచాలని, తద్వారా కరీంనగర్ ను ఒక ఐకాన్ లాగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు(Constituency In-charge Velchala Rajender Rao) జిల్లా కలెక్టర్ ను కోరారు. నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని, రాష్ట్రంలోనే కరీంనగర్ కు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. గురువారం రాజేందర్ రావు కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లతో కలిసి కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy)నీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు కలెక్టర్ ను శాలువాతో సన్మానించారు.

కరీంనగర్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై సుదీర్ఘంగా జిల్లా కలెక్టర్ తో చర్చించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున రాజేందర్, ఆర్ష మల్లేశం, వైద్యుల అంజన్ కుమార్, ఆకుల నరసన్న, భూమా గౌడ్, కట్ల సతీష్, పడిశెట్టి భూమయ్య, మూల రవీందర్ రెడ్డి, వేల్పుల వెంకటేష్, ముద్దసాని క్రాంతి, కామ్ రెడ్డి రామిరెడ్డి, కంకణాల అనిల్, కొలగాని అనిల్, పంజాల శ్రీనివాస్ గౌడ్, పంజాల స్వామి గౌడ్, సాయినీ తిరుపతి గౌడ్, బట్టు వరప్రసాద్, పత్తెం మోహన్, పట్టెం లక్ష్మీనారాయణ, బండి సాయి కృష్ణ, కల్వాల రామచందర్, సరిల్ల రతన్ రాజు గండి శ్యామ్, హరీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.