calender_icon.png 4 July, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి

03-07-2025 07:45:07 PM

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

వృత్తి నైపుణ్యాల పైన డ్యూటీ మీట్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రతి రోజు విధి నిర్వహణలో కేసుల దర్యాప్తు, నేర పరిశోధనలో ఎదురవుతున్న అంశాల పట్ల సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని అవి ఎంతో దోహదపడతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar) అన్నారు. తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్(Police Duty Meet) ఈ నెలలో వరంగల్ లో నిర్వహించనున్న నేపథ్యంలో యాదాద్రి జోనల్ స్థాయిలో కేసుల దర్యాప్తు, పోరెన్సీక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, నేర పరిశోధన ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం, లాంటి అంశాలపై గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నల్లగొండ, సూర్యాపేట, జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బంది జోనల్ స్థాయి డ్యూటి మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మనం నిర్వహించే విధుల పట్ల మెలుకువలు పెంపొందించుకోవాలని అన్నారు. ఈ జోనల్ స్థాయిలో నిర్వహించే కేసుల దర్యాప్తు, పోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, నేర పరిశోధనలో ఫోటోగ్రఫీ, విడియో గ్రఫి, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం, లాంటి అంశాలలో పట్టు సాధించి జోనల్ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో ఎంపికై యాదాద్రి జోన్ కి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, నరసింహ చారి, రిజర్వు ఇన్స్పెక్టర్లు, శ్రీను, సంతోష్, హరిబాబు, సూరప్ప నాయుడు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.