03-07-2025 08:01:08 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం అభినందనీయమని క్యాతన్ పల్లి పుర కమిషనర్ రాజు(Commissioner Raju) అన్నారు. గురువారం యువత జనం కోసం అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక సింగరేణి ఠాగూర్ స్డేడియం ఎదుట గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 40 మంది విద్యార్థులకు పుర కమిషనర్ రాజు చేతుల మీదగా ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువత జనం కోసం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్, యువత ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి, కార్యదర్శి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.