03-07-2025 08:06:40 PM
లక్ష 40 వేల విలువైన గుడుంబా స్వాధీనం..
ఒక ఆటో, ద్విచక్ర వాహనం సీజ్..
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): చత్తీస్గడ్ రాష్ట్రం నుండి అక్రమంగా వెంకటాపురం తరలిస్తున్న గుడుంబాను వెంకటాపురం పోలీసులు గురువారం పట్టుకున్నారు. వెంకటాపురం ఎస్ఐ తిరుపతి రావు(SI Tirupati Rao) కథనం ప్రకారం... చత్తీస్గడ్ రాష్ట్రం నుండి మండలానికి అక్రమంగా మద్యం రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు గురువారం ఉదయం ఎస్సై ఇద్దరు ప్రొహిబిషనరీ ఎస్ఐలు, సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ద్విచక్రవాహనంతో పాటు ఆటోలో తరలిస్తున్న 360 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ఒక లక్ష 44 వేల రూపాయలు ఉంటుందని ఎస్ఐ తిరుపతి రావు తెలిపారు.
వెంకటాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కన్నెబోయిన మల్లేష్ మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన నిమ్మల మనోజ్ లను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ గుడుంబా వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మండలంలో ఎవరైనా అక్రమ గుడుంబా తయారీ కామ వికలాయాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ దాడుల్లో ఎస్ఐ తిరుపతిరావు ట్రైనీ ఎస్సైలు తిరుపతి రెడ్డి, సాయి కృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.