calender_icon.png 24 August, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి వినాయకులని వాడాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి

24-08-2025 05:53:59 PM

హన్మకొండ,(విజయక్రాంతి): మట్టి వినాయకుల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు తెలిపారు. నగరంలోని భక్తులు మట్టితో తయారుచేసిన మహాగణపతులను, ఇండ్లలో పెట్టుకుని వినాయకులు మట్టితో తయారు చేసినవి ప్రతిష్టించుకుంటే భవిష్యత్ తరాలకు కూడా హాని కల్పించని వారం అవుతామని కావున ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించాలన్నారు.

దాని వలన పర్యావరణం పరిరక్షణలో చేయి చేయి కలిపి సమస్త జీవకోటికి ప్రాణహాని కలగకుండా రసాయనాలతో కూడిన రంగురంగుల గణపతులను ప్రతిష్టించడం వల్ల వ్యక్తిగతంగా, సమాజ పరంగా, జీవ పర్యావరణానికి ప్రమాదం కలగకుండా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని ప్రిన్సిపాల్ తెలిపారు. ములుగు రోడ్డు  జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ చేపట్టారు. అందరూ సహకరించాలని,మట్టి వినాయకుల ని ప్రతిష్టించాలని నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారని ప్రిన్సిపాల్ తెలిపారు.