24-08-2025 06:02:39 PM
నిజామాబాద్,(విజయక్రాంతి): మహమ్మద్ అలీ షబ్బీర్ 45 సంవత్సరాల రాజకీయ జీవన ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ గాంధీభవన్ లో పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాబినెట్ మంత్రులు ముఖ్య నాయకులు ఎన్నో ఒడిదుడుకుల మధ్య మొదలైన రాజకీయ ప్రస్థానం ఒకే పార్టీలో 45 సంవత్సరాలు ఎన్ ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు మంత్రిగా ఎమ్మెల్సీగా శాసనమండలి ప్రతిపక్ష నేత గా ప్రభుత్వ సలహాదారుగా నేటి వరకు ప్రయాణం వివిధ పదవుల్లో ఆయన కొనసాగారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్గదర్శిగా నిలిచిన నేత జీవితాన్ని, ఆయన దూరదృష్టిని ఆవిష్కరించే ఒక ప్రత్యేక పుస్తకం ముఖ్యమంత్రి విడుదల చేశారు. మావోయిస్టుల బాంబుదాడి ఘటన నుంచి ప్రభుత్వ సలహాదారు దాకా ఉగ్రవాయి శివారులో జరిగిన బాంబు దాడి అనంతరం ఆయన చూపిన ధైర్యం, పట్టుదల, ఆయన ప్రజలతో కలిసే తీరు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న విధానం హృదయాన్ని హత్తుకునేలా చేసింది.