calender_icon.png 24 August, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సంతాపం

24-08-2025 05:48:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వర్గీయ సురవరం సుధాకర్ రెడ్డి మృతి పార్టీకి ప్రజలకు తీరని లోటని ఆ పార్టీ నాయకులు ఎస్ఎన్ రెడ్డి ముఖ్య రమేష్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కమ్యూనిస్టు నాయకుడిగా పేదల హక్కుల కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశారని అవి ప్రజలకు ఉపయోగపడ్డాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.