04-09-2025 12:00:00 AM
కరీంనగర్, సెప్టెంబరు 3 (విజయ క్రాంతి): నగరంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ద కీటు ఎంటర్ప్రెన్యూర్స్ కంటిన్యూస్ గ్రోత్ అనే అంశంపై బుధ వారం కళాశాల ఎంట్ర్పనేర్షిప్ అండ్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో, సెంటర్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, హైదరాబాద్, వ్యవస్థాపకుడు మంచికట్ల అనిల్ నేతృత్వంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన వ్యాపారంలో నిరంతర వృద్ధి సాధించడానికి అవసరమైన మైండ్సెట్, వ్యూహాలు, సృజనాత్మక దృక్పథాలపై విలువైన సూచనలు అందించారు. నేటి పోటీ ప్రపంచంలో అనువర్తనం, ఆర్థిక క్రమశిక్షణ, నెట్వర్కింగ్, నిరంతర అభ్యాసం ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా వివరించారు.
కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు మాట్లాడుతూ ప ట్టుదల, సానుకూల దృక్పథాన్ని అనపర్చుకొని, నూతన విషయాలపై అవగాహన పెంచుకొని వ్యాపార రంగంలో తమదైన శైలిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డా టి అనిల్ కుమార్, డీన్ అకాడమిక్స్ డా పి కే వైశాలి, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.