calender_icon.png 8 September, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నాళ్ళు.. ఎన్నేళ్లు.. జనప్రియ లో కానరాని చెత్త శుద్ధి..

07-09-2025 10:11:01 PM

పట్టించుకోని పారిశుద్ధ్య అధికారులు..

ఉప్పల్ (విజయక్రాంతి): హైదరాబాద్ విశ్వనగరం, భారతదేశంలో ఒక శాంతి నగరంగా విరాజిల్లుతూ వుంది. నగరం ఆహ్లాదకరమైన వాతావరణం కలిగింది. కాని చాలా చోట్ల ఈ నగర అందం రోజు రోజుకు మసిబారుతుంది. హైదరాబాద్ నడిబొడ్డున మల్లాపూర్ జనప్రియ ఎక్కడ పడితే అక్కడ చెత్త, మురికి పేరుకుపోయిన దృశ్యాలు దర్శనమీస్థాయి. నాచారం, ఈ సీల్ మధ్యలో 1998 లో మల్లాపూర్ లో జనప్రియ టౌన్షిప్ వెలిసింది. ఆ తరువాతనే ఈ ప్రాంతం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో చాలా అపార్ట్మెంట్స్, అభివృద్ధి వేగంగా సాగింది. కాని ఈ అపార్ట్మెంట్స్ లోపల అంధకారంతో అంధ విహీనమైన స్థితికి చేరుకున్నాయి. ఉదాహరణకు జనప్రియ టౌన్షిప్ లోపల చూస్తే నిజంగా ఇది హైదరాబాదా అనే సందేహం కలుగుతుంది. అపార్ట్మెంట్ లోపల చెత్త పేరుకుపోయి, వర్షం నీటితో బురద, మడుగులు ఏర్పడి నివాసానికి అననుకూల పరిస్థితి ఏర్పడింది. అపార్ట్మెంట్ మానేజ్మెంట్ కాని, మున్సిపల్ కాని కళ్లు మూసుకుని వున్నాయి.

రాత్రి దోమల బెడద ఎక్కువగా వుంది, బురద నీరు, పేరుకుపోయిన చెత్త దుర్గంధమును వ్యాప్తి చేస్తుంది, దీనికి తోడు నిర్భయంగా కొందరు అదేపనిగా చెత్తను అపార్ట్మెంట్ వెనకాల విసిరి వేయడం, మేనేజ్మెంట్ చూసి చూడనట్టుగా వ్యవహరించడం, మున్సిపాలిటీ పట్టించుకోకపోవడం పరిస్థితి దినదినం దిగజారుతూ ఉంది. కావున స్థానిక ప్రభుత్వాలు, మేనేజ్మెంట్, సివిల్ సొసైటీ కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. ప్రతిరోజూ పేరుకుపోతున్న చెత్తచెదారం వేరే డంపింగ్ యార్డ్ కు పంపాలని, అపార్ట్మెంట్ లోపల 25 సంవత్సరాల క్రితం వేసిన రహదారులను తీసి తిరిగి కొత్త రహదారులు వేయాలని, కనీసం వారానికి 3 సార్లు దోమల నివారణ చర్యలు చేపట్టాలని, అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. ఇక్కడ నివసించే వాళ్లు మధ్య మారాయి దిగువ మధ్యతరగతి చెందిన వారు కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.