calender_icon.png 8 September, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించాలి

07-09-2025 10:01:24 PM

ఎస్ జి టి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్..

బాన్సువాడ (విజయక్రాంతి): ప్రాథమిక పాఠశాలలో ఖాళీ అయిన ఉపాధ్యాయుల స్థానాల్లో విద్యా వాలంటీర్ లను నియమించాలని ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం(SGT Teachers Association) జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ ఎస్జీటీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సమస్యలపై తీర్మానించారు. సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 317 జీవోను అమలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో బాన్స్వాడ డివిజన్లోని ఎస్జీటీయూ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.