07-09-2025 09:59:11 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో తెలంగాణ గురుకుల పేరెంట్స్ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజీపీఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోగడం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా గౌరవ అధ్యక్షునిగా దుబ్బాక శంకర్, జిల్లా అధ్యక్షునిగా కొత్తపల్లి సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా గుర్రం మహేష్, ఉపాధ్యక్షులుగా బేగరి సాయిలు, సాయికుమార్, గోపాల్, ప్రేమ కుమార్, రాజు, సుంకరి రవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.