calender_icon.png 8 September, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ న్యాయవాది ప్రదీప్ కుమార్ ను పరామర్శించిన మాజీ మంత్రి

07-09-2025 09:57:13 PM

మోతె: ఆదివారం మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డులో సీనియర్ న్యాయవాది పొదిల ప్రదీప్ కుమార్ మాతృమూర్తి అనసూయ ఇటీవల మృతి చెందడంతో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తల్లి అనసూయను కోల్పోవడం కుటుంబానికే కాక ఈ ప్రాంత ప్రజలకు తీరనిలోటని తెలిపారు. ఏ ఆపద వచ్చిన ఈ ప్రాంత ప్రజలకు ధైర్యం ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా ఆదుకొని ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకునె తల్లి లేకపోవడం విచారకరమని తెలిపారు. సీనియర్ న్యాయవాది పొదిల ప్రదీప్ కుమార్ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసి తన సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ గోపగాని వెంకటనారాయణ, జిల్లా గ్రంధాల సంస్థ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మారుపెద్ది శ్రీనివాస్ గౌడ్,  సీనియర్ అడ్వకెట్ బి. రామారావు, పెన్ పహాడ్ మండల బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నెమ్మాది బిక్షం, తదితరులు పాల్గొన్నారు.