11-10-2025 12:51:26 AM
గద్వాల టౌన్ : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో డాక్టర్ అభినేష్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి రాజేందర్ మాట్లాడుతూ మానసిక రోగుల గురించి వారి చట్టాల గురించి వైద్యులకు వివరించి వారి యొక్క సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వి.రాజేందర్, బి. శ్రీనివాసులు,డి. లక్ష్మణ స్వామి మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రవి, నవీన్ పాల్గొన్నారు.