calender_icon.png 11 October, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిలియంట్ కాలేజీలో చోరీ

11-10-2025 12:53:13 AM

  1. రూ.1.7 కోట్ల నగదును ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
  2. దుండగులు కోసం 15 ప్రత్యేక టీమ్‌లు గాలింపు చర్యలు

అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 10: బ్రిలియంట్ కాలేజీలో భారీ చోరీ జరిగిన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ బ్రిలియంట్ కాలేజీలో దాదాపుగా రూ. 1.7కోట్ల వరకు నగదును గుర్తు తెలియని వ్యక్తులకు ఎత్తికెళ్లినట్లు  గమనించి కాలేజీ ప్రిన్సిపల్ వీరన్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులతో పాటు ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, క్రైమ్ డీపీపీ, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ వి. అశోక్ రెడ్డి, క్లూ టీమ్‌లతో సహా వచ్చి సంఘటన స్థలానికి చేరుకొని కాలేజీలోని ఆఫీసు కార్యాలయాన్ని పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులు బ్రిలియంట్ కాలేజీ పరిసరాల ప్రాంతాలను కలిగి తిరిగారు. 

చోరీ జరిగిందిలా..!

బ్రిలియంట్ కాలేజీ యాజమాన్యం గురువారం సాయంత్రం 06:00 గంటలకు కళాశాలను ముగించుకుని ఆఫీసుకు కాలేజీ గేట్‌లకు తాళ్లాలు వేసి వెళ్లారు. శుక్రవారం ఉదయం 08:45 నిమిషాలకు కాలేజీ ఏవో కేశినేని కుమార్ వచ్చి చూసే సరికి గేట్లు, ఆఫీసులో డోర్లు పగలగొట్టి బీరువాలో చిందర వందరగా పడి ఉండడంతో వెంటనే కాలేజీ ప్రిన్సిపల్ వీరన్నకు జరిగిన సంఘటనపై  ఫోన్ సమాచారం ఇచ్చాడు.    

24 గంటలు సీపీ కెమెరాలు నిఘా

అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బ్రిలియంట్ కాలేజీలో మూడు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులు ఒకే చోట భద్రపరిచారు. లవాదేవీలు చూసే వ్యక్తి మూడు రోజులు పాటు సెలవులో ఉండడంతో ఆ డబ్బు ఒకే చోట భద్రపరిచినట్లు తెలిసింది. ఈ మూడు క్యాంపస్‌లకు మొత్తం 200 వందల సీసీ కెమెరాలున్నాయి. ఇంత సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ భారీ చోరీ జరగడం వెనుక పలు అనుమానాలు తావిస్తుంది.

నగదు ఎత్తుకెళ్లిన దుండగులు దాదాపు 100 సీసీ కెమెరాలకు సంబధించిన హార్డ్‌డిస్క్‌ను కూడా ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది.  24 గంటల పాటు సీపీ కెమెరాలు నిఘా కాలేజీ బయట కావొచ్చు.. లోపల కావొచ్చు సీసీ కెమెరాల నిఘా ఉందన్నట్లు నోటీసులు ఉన్నప్పటికీ దుండుగులు చోరీ ఎలా జరిగిందోనని పలు అనుమానులు వ్యక్తమవుతున్నాయి.   

అంతుచిక్కని అనుమానాలు..!

బ్రలియంట్ క్యాంపస్‌లో జరిగిన భారీ చోరీలో ఎలాంటి క్లూ దొరకపోవడం.. అదేవిధంగా నగదు చోరీ చేసిన దుండగులు 100 సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లాంటి ఎత్తుకెళ్లటంతో.. కాలేజీ  పనిచేసే సిబ్బంది కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. అదే విధంగా గేట్లను, తలుపులను ధ్వంసం చేయడం..అదే విధంగా ఆఫీసులో మూడు.. నాలుగు బీరువాలు ఉన్నప్పటికీ..

ఇదే బీరువాలో డబ్బులున్నాయని చోరీ చేసే దుండగులకు ఏలా తెలుస్తుంది  కాలేజీ సిబ్బంది చేశారా.. లేక విద్యార్థులను ఎవ్వరైనా చేశారా లేక దుండుగులే చోరీ చేశారాని పోలీసులకు అంతుచిక్కని అనుమాలను వ్యక్తమవుతున్నాయి. ఏదీ ఏమైనా చోరీ చేసిన దుండగుల కోసం 15 ప్రత్యేకమైన టీమ్‌లను ఏర్పాటు చేసి.. కాలేజీ నుంచి గోగూల్ మ్యాప్ పెట్టుకుని ఎన్ని దారులుంటే అన్ని దారులను దిగ్బందించినట్లు తెలిసింది.