calender_icon.png 28 October, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు..

28-10-2025 05:26:02 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, సతీమణి లక్ష్మీ ముఖ్య అతిథులుగా పాల్గొని 50 కేజీల కేక్ కట్ చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు పట్టణ, మండల, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ మున్సిపల్ చైర్మన్ లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్స్, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ యూత్ విభాగం, కాంగ్రెస్ మహిళా కమిటీ, ఐఎన్టీయూసీ నాయకులు, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.