28-10-2025 05:45:06 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తిలో భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్ల బొడ్రాయి 5వ వార్షికోత్సవాన్ని మంగళవారం బస్తీ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోచమ్మ బోనాల జాతరను నిర్వహించారు. హనుమాన్ బస్తీలోని బొడ్రాయి అమ్మవార్ల నుండి పోచమ్మ దేవాలయం వరకు డప్పు చప్పులతో మహిళలు బోనమెత్తుకొని భారీ ఊరేగింపుగా తరలి వెళ్లారు.