28-10-2025 05:36:27 PM
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని సీతంపల్లి గ్రామంలో నవ క్రాంతి ఎఫ్ పి సి ఎల్ ఆధ్వర్యంలో ఆర్ ఏ ప్రాజెక్ట్ లో భాగంగా మంగళవారం రైతుల శిక్షణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నవ క్రాంతి సంస్థ ప్రతినిధి ఎస్.రాజశేఖర్ రైతులతో మాట్లాడుతూ పునరుజ్జీవన పంట ఉత్పత్తిపై ముఖ్యమైన అంశాలను వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రైతులకు కవర్-క్రాపింగ్, సంరక్షణ పద్ధతులు, పంట మార్పిడి, బహు పంటలు & అంతర పంటలు, శాశ్వత పంటలు, సహజ ఎరువులు, రసాయన ఎరువుల తగ్గింపు, సహజ పంట రక్షణ, క్రిమిసంహారక రసాయనాల తగ్గింపు, నీటి వినియోగ సామర్థ్యపు చర్యలు, మట్టి నిర్వహణ గురించి విపులంగా వివరించారు. శిక్షణ కార్యక్రమం అనంతరం రైతులకు వేప నూనె, పిపి ఈ కిట్లు, పి ఎస్ బి, లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు అందించారు. ఈ కార్యక్రమంలో నవ క్రాంతి సంస్థ సిబ్బంది ఎన్ రాజశేఖర్, మధుకర్, రాజు, గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.