calender_icon.png 28 October, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ..

28-10-2025 05:43:51 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో విద్యార్థులకు మంగళవారం నోట్ బుక్స్ పంపిణీ చేశారు, గవర్నర్  అధికారిక పర్యటనలో భాగంగా వాసవి క్లబ్, వాసవి వనిత క్వీన్స్ క్లబ్ లను సుల్తానాబాద్  లో  సందర్శించారు, వారిని మర్యాద పూర్వకంగా సత్కరించుకోవడం జరిగింది. క్లబ్ ఆదాయ వ్యయంలకు సంబంధించి వివరాలను పరిశీలించారు, క్లబ్ స్క్రాప్ బుక్, ఫోటో ఆల్బమ్ చూసినారు.

అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా గవర్నర్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ సుల్తానాబాద్ వాసవి వనిత క్వీన్స్ క్లబ్ సుల్తానాబాద్ వారు శాస్త్రీనగర్ లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నోటుబుక్కులు, పెన్నులు, పెన్సిల్, రబ్బర్లు పంపిణీ చేయడం జరిగింది. అంగవాడి లోని చిన్న పిల్లకు పలకలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమలో గవర్నర్ ఇల్లందుల కిషోర్ కుమార్, అల్లెంకి  లింగమూర్తి, యాంసాని రమాదేవి, బాదం వాణి, కాసం సత్యనారాయణ, పి ఎస్ టి లు పల్ల సౌమ్య, పల్ల అలేఖ్య, నాగమల్ల సంధ్య, అల్లెంకి హరీష్, అనగంవంశీ, కొమురవెల్లి రమేష్, పి, రమేష్, పి. వాణి పలువురు పాల్గొన్నారు.