28-10-2025 05:38:45 PM
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్ డిమాండ్..
బాన్సువాడ (విజయక్రాంతి): రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మార్కెట్ కమిటీలో ఉన్న తడిచి పోయిన ధాన్యాన్ని సిపిఎం పార్టీ బృందం పరిశీలించడం జరిగింది. అనంతరం వెంకట్ గౌడ్ మాట్లాడుతూ 20 శాతం తేమ ఉన్న ధాన్యం కోనుగోలు చేయాలని ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర మంత్రివర్యులు తేమ ఉన్న 20 శాతం తేమ ఉన్న తీసుకోవాలని ఆర్డర్స్ ఇస్తున్న ఇక్కడ మాత్రం రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న కొందరు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
మూడు రోజుల క్రితం తడిసిపోయిన ధాన్యాన్ని తీసుకోమని నసూర్లబాద్ మండలంలో రైతులు రాస్తారో కూడా చేశారని రైతులను ఇలా ఇబ్బందులు చేస్తున్న రైస్ మిల్లులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒకవైపు మళ్ళీ తుఫాన్ హెచ్చరికల ఉన్నాయని ఇప్పటికి చాలామంది రైతులు వరి కోసి రోడ్ల వెంట కుప్పల్ పోసి ఉన్నాయని అలాంటి రైతులకు కవర్లు అందజేయాలని భారీ వర్షం వస్తే నష్టపోయిన రైతులను ప్రభుత్వం రక్షించాలని ఇంకా కొయ్యని రైతులు తుఫాన్ కారణంగా నష్టపోతే ఎకరాకు 40,000 ప్రభుత్వం కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు సన్న దొడ్డు వరి వంగడాల్లో అకాల వర్షాల కారణంగా దిగుబడి తగ్గిందని ఇంకా మళ్ళీ తడిసిన ధాన్యాన్ని తేమ పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేస్తే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకులు రవీందర్ ఖలీల్ యాదగిరి గౌడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.