28-10-2025 05:47:20 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మంగళవారం వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. పట్టణంలోని హనుమాన్ బస్తిలో రోజులాగే పాలు అమ్ముకుంటున్న టేకులపల్లి గ్రామానికి చెందిన ధారవెల్లి లక్ష్మి అనే వృద్ధురాలిపై బీభత్సంగా దాడి చేశాయి. కుక్కల దాడిలో రెండు కాళ్లకు గాయాలు కాగా తీవ్రంగా రక్తస్రావమైంది. స్థానికులు కుక్కల గుంపులు తరిమేసి గాయపడ్డ వృద్ధురాలు లక్ష్మిని హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాయపడ్డ బాధితురాలు ధారవెల్లి లక్ష్మిని వైద్యులు 108 అంబులెన్స్ లో మంచిర్యాలకు తరలించారు. వీధి కుక్కల దాడులతో పట్టణంలో ఆందోళనకర పరిస్థితి తలెత్తుతుంది.