calender_icon.png 28 October, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

28-10-2025 05:52:31 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తిరుమలనగర్ జానపద వృత్తి కళాకారుల సంఘం జిల్లా స్థాయి సమావేశం మంగళవారం రోజున జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు తాళ్ల పెళ్లి వెంకటలక్ష్మి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల గుర్తింపు కార్డు ఇవ్వాలని, వృద్ధ కళాకారులకు పెన్షన్లు మంజూరు చేయాలని, ఆరోగ్య కార్డులు ఉచితంగా ఇవ్వాలని, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ద్వారా గుర్తింపు మంజూరు చేయాలని కార్యక్రమాలకు కళాకారులకు ఆర్థిక సాయం అందించాలని, కళాకారులు అడిగే డిమాండ్లు న్యాయబద్ధమైనయని ఆమె అన్నారు.

వచ్చే నెలలో హైదరాబాదులో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తదుపరి మరొక అతిధి రాష్ట్రస్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కళాకారులు ఐక్యమత్యంతో ఉండి వారి హక్కులను సాధించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం దాట్ల నిర్మల, ఎద్దు మమత, మల్యాల కొమురయ్య, న్యాతరి పద్మ, పెరుమల్ల గంగయ్య, బూడిద అనసూర్య, శ్యామల, కేశబోయిన రమాదేవి, చిలక రజిత, ఆడెపు రజిత, ఈర్ల స్వాతి, వాణి, రజిత, మమత, సముద్రాల ఓంకార్, దాట్ల నిర్మల,తాండ్ర స్వర్ణలత, బండారి స్వప్న, ఉప్పు మల్లేశ్వరి, మిడిమిల్లి రేణుక, గిట్ల సునీత,మామిడి రాజేశ్వరి, బుర్ర సరూప, భూమా సవిత మరియు కళాకారులు పాల్గొన్నారు.