calender_icon.png 28 October, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వివిఆర్

28-10-2025 05:28:01 PM

దేవరకొండ (విజయక్రాంతి): భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్(యుఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలలో నిజామాబాద్ పట్టణంలో అక్టోబర్ 25, 26, 27 తేదీల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభల్లో వంగూరి వెంకటేశ్వర్లు విద్యార్థి ఉద్యమాలను గుర్తించి తన సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. నియామకం అనంతరం వంగూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తూ సంఘ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, తిరుపతి నిర్మాణ బాధ్యులు లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ సార్ చందర్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.