08-08-2025 04:46:06 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామంలో రైతు అవగాహన సదస్సు బేర్ కంపెనీ వారిచే వరిలో వచ్చే మొగి పురుగు నివారణకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బేర్ కంపెనీ టెరిటరీ జిల్లా మేనేజర్ నవీన్(Bear Company Territory District Manager Naveen) మాట్లాడుతూ, అత్యధిక వేరు వ్యవస్థకు బేర్ కంపెనీ వారి బికోట గులికలను వాడాలని సూచించారు. ఈ సదస్సులో సూపర్వైజర్ సతీష్ రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్స్ మాటూరీ శివకుమార్, శివ, రైతులు పాల్గొన్నారు.