calender_icon.png 8 August, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పేదలకు వరం

08-08-2025 07:24:06 PM

డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్..

జనగామ (విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) కేంద్రంలో శ్రీ సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ వైద్యశాలలో ఆరోగ్యశ్రీ సేవలు, ఆర్థోపెడిక్ పాలిట్రామకు సంబంధించిన చికిత్సలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా సేవలు అందజేయడం జరుగుతుందని డాక్టర్ లక్ష్మి నారాయణ ఒక ప్రకటనలో తెలుపుతూ ఆహార భద్రత కార్డు లేకున్నా సీఎమ్ఓ అప్రూవల్ ద్వారా అనుమతి తీసుకొని ఉచిత చికిత్సలు చేయడం జరుగుతుందని అన్నారు. మా వైద్యశాల పై నమ్మకంతో యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సూర్యపేట, జిల్లా వాసులు కూడా వచ్చి చికిత్స పొందారు ఎప్పుడు మా వైద్యశాల నమ్మకాన్ని కోల్పోకుండా పేద ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యమని గత కొంతకాలంగా సేవలు అందించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేని పేదలకు కూడా మేము వైద్యం అందించడం జరుగుతుంది. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదలకు ఒక వరం లా దివంగిత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పెట్టడం సాధారణ ప్రజలలో వెలుగు వెలుగులు నింపడమే అని అన్నారు.