08-08-2025 07:19:14 PM
పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యులు బాలునాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి..
దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల రివ్యూ మీటింగ్ జరిగింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi), ఆర్డీవో రమణారెడ్డి, హౌసింగ్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, సంబధిత సిబ్బందితో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్(MLA Nenavath Balu Naik) సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సాంకేతిక కారణాలతో ఇంకా పెండింగ్లలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. దశలవారీగా పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే వారి ఖాతాలలో డబ్బులు జమ కావాలని అన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందనీ, లబ్ధిదారుల ఇంటినీ త్వరగా పూర్తి చేపించే బాధ్యత అధికారులదేనని సమీక్ష సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు.