08-08-2025 04:48:06 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల శ్రీ హరి హర త్రిశక్తి క్షేత్రంలో శ్రావణ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా త్రిశక్తులు (మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి) అమ్మవార్ల ధనలక్ష్మి దేవి అలకరణములో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు త్రిశక్తులను పెద్దఎత్తున దర్శించుకున్నారు. అదేవిధంగా మరకత శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేరే సంస్కృతి పరిషత్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.