08-08-2025 07:27:25 PM
కుభీర్: తరచూ వాతావరణంలో మార్పుల కారణంగానే రైతులు సాగు చేసుకున్న పంటలకు అధికంగా చీడపీడలు వ్యాపిస్తున్నాయని వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఎం నారాయణ(Agricultural Extension Officer Narayana) రైతులకు సూచించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సోనారి క్లస్టర్ లోని సొనారి, హంపోలి, గోడపూర్ తదితర గ్రామాలలో ఆయన పలువురి రైతుల పంట క్షేత్రాలకు వెళ్లి సాగు చేసుకున్న పత్తి, సోయా పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. వాతావరణంలో ఉష్ణోగ్రత అధికమవడంతో చీడపీడలు ఎక్కువగా ఆశించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సోయా పంటకు లద్దెపురుగు, పల్లాకు తెగులు, కాండం కుళ్ళు తెగులు ఆశించి నష్టం చేస్తున్నాయని అన్నారు. లద్దెపురుగు నివారణకు థాయోడికార్ప్ 1.5 గ్రా లీటర్ నీటికి, ఇమోమిక్టిన్ బింజొఇట్ 0.5 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని, కాయకుళ్ళు నివారణకు టెబ్బుకోనాజోల్, సల్ఫార్ 2.5 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడంతో చీడపీడల నుంచి పంటలను పూర్తిగా రక్షించుకోగలుగుతామని సూచించారు. ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.