calender_icon.png 19 November, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా గ్రంథాలయంలో ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు

19-11-2025 10:06:50 PM

హనుమకొండ (విజయక్రాంతి): గ్రంధాలయ సంస్థ హన్మకొండలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా, ఆరవ రోజు ఉదయం 11 గంటలకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మహ్మద్ అజీజ్ ఖాన్ గ్రంథాలయంలో, ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాడు.ఈ కార్యక్రమ అనంతరం మహిళా దినోత్సవంను పురస్కరించుకొని మహిళా పాఠకులకు, విద్యార్థినీలకు ముగ్గుల పోటీ, మెహిందీ పోటీ, మ్యూజికల్ చైర్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమములో  జిల్లా గ్రంథాలయ సంస్థ హనుమకొండ అధ్యక్షులు మహ్మద్ అజీజ్ ఖాన్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ బన్న ఐలయ్య, సామాజిక కార్యక్రమాల నిర్వాహకురాలు, రిటైర్డ్ హెడ్మాస్టర్ డా. వేదాంతం శ్రీ దేవి, సంస్థ కార్యదర్శి కె.శశిజాదేవి సిబ్బంది మలుసూరు, పురుషోత్తం రాజు, జూనియర్ అసిస్టెంట్ పి.సంతోష్ కుమార్, రికార్డు అసిస్టెంట్ మమత,  ఇంటర్నెట్ సెక్షన్ నిర్వాహకులు రాజేష్ మరియు గ్రంథాలయ సిబ్బంది, గ్రంథ పాఠకులు, వివిధ పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.