19-11-2025 10:19:40 PM
కాటారం(మల్హర్) (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామస్తుల, ఆయకట్టు రైతుల అభ్యర్థన మేరకు మల్లారం చెరువు కట్ట మరమ్మత్తు పనులను తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి ఆదేశాల మేరకు బుధవారం ప్రారంభించారు. చెరువుకు ఇరువైపులా ఉన్న తుమ్మ చెట్లను తొలగించి, కట్టపై రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అడుగగానే పనులు చేపట్టడం పట్ల గ్రామస్తులు, రైతులు ఏఎమ్మార్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ వర్క్ సూపర్ వైజర్ బోబ్బిలి నరేష్ గౌడ్ పనులు పర్యవేక్షించారు.