19-11-2025 10:23:17 PM
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధి బండమీద పల్లి గ్రామంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని కార్తీక దీపోత్స వేడుకలను ఘనంగా జరిగాయి. గ్రామంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో భజనమండలి ఆధ్వర్యంలో నెలరోజుల పాటు భక్తులు భక్తిశ్రద్ధలతో భజన సంకీర్తనలు నిర్వహించారు. బుధవారం కార్తిక అమావాస్య సందర్భంగా భజన సమప్తి నిర్వహించి 365 దీపాలను వెలిగించి గ్రామంలో ఊరేగించారు. అనంతరం హనుమాన్ దేవాలయంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువకులు, గ్రామపెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.