19-11-2025 10:17:31 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..
హనుమకొండ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి విద్యార్థులలో ఆంగ్లభాష నైపుణ్యాలను పెంపొందించడానికి కోసం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ యొక్క ఆలోచన మేరకు లెట్స్ ఎన్రిచ్ అవర్ ఇంగ్లీష్ అనే 30 రోజుల కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్స్ ఒక మాడ్యుల్ రూపొందించి, ఈ రోజు నుండి 14 మండలాలలోని కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ కి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 30 రోజుల్లో ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి విద్యార్థులు మాట్లాడడం,మరియు చదవడం, నైపుణ్యాలను పెంపొందించడం కోసం రూపొందించినటువంటి మాడ్యూల్ ఈరోజు కలెక్టర్ తన చాంబర్లో ఆవిష్కరించడం జరిగింది.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి బిడియం లేకుండా ఆంగ్లంలో సులభంగా మాట్లాడేటటువంటి యాక్టివిటీస్ ఇందులో చేర్చడం జరిగిందని, అలాగే ఇట్టి మాండ్యుల్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అందరూ ఉపయోగించి హనుమకొండ జిల్లాలో అత్యుత్తమమైనటువంటి ఫలితాలను తీసుకొని రావాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్మోహన్, మాడ్యూల్ రూపకర్తలైనటువంటి రోజా రాణి, పద్మావతి, పండరీ వాసు, కోలా రవికుమార్, సంపత్ మరియు మహిపాల్ పాల్గొన్నారు.