calender_icon.png 19 November, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ల విడుదల కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం

19-11-2025 10:08:35 PM

రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ..

కరీంనగర్ (విజయక్రాంతి): విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్షిప్ విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తానని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ తెలిపారు. బుధవారం ఆయన కరీంనగర్లో పర్యటించారు. సామాజిక కార్యకర్త సాజిద్ ఖాన్ నివాసంలో సీనియర్ సిటిజన్స్ తో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలకు మైనార్టీ కమిషన్ వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు.

మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి కమిషన్ ద్వారా తీసుకువెళ్తామన్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్ సమస్యలతో పాటు, 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసేలా ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజన్స్ అధ్యక్షుడు నసీముద్దీన్, సర్వరోద్దీన్, ఖాజా జమాలొద్దిన్, బీఆర్ఎస్ నాయకులు నయిమ్, ఇమ్రాన్, బషీర్ ఖాన్, మహమూద్ ఖాన్, సాబీర్ ఖాన్, మాజీ కార్పొరేటర్ అఖీల్ ఫిరోజ్, తదితరులు పాల్గొన్నారు.