calender_icon.png 25 January, 2026 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుపై అవగాహన సదస్సు

24-01-2026 12:00:00 AM

చలి తీవ్రతతో గుండె పోటు ప్రమాదం

కోరుట్ల,జనవరి23 (విజయక్రాంతి)చలి తీవ్రతతో రక్తం చిక్కబడి, నరాలు కుంచించుకపోయి గుండెపై ఒత్తిడి పెరగడం కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని మెడికవ ర్ వైద్యులు తెలిపారు. శుక్రవారం కోరుట్లలోని ఇష్టా హోటల్లో చలికాలం సీజన్లో వచ్చే గుండె జబ్బులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ మిగతా సీజన్ల కంటే చలికాలంలో నీళ్లు తక్కువగా తాగడం వల్ల రక్తం చి క్కబడడం, ఆస్తమా, స్మోకింగ్ ఊపిరితిత్తుల దారులు మూసుకుపోవడం, ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.

అదే విధంగా రక్తం చిక్కబడడం, రక్తసరఫరాలో ఇబ్బందుల వల్ల గుండెకు ఆక్సిజన్ అందక గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందన్నారు. గుండె వ్యాధిగ్రస్తులు ప్రమాదకర చలిలో బయటకు వెళ్లకూడదని సూచించారు. ము ఖ్యంగా షుగర్, కిడ్నీ, బీపీ, కేన్సర్, టీబీ వ్యాదితో బాధపడే వారు మరింత జాగ్రత్తగా ఉంటూ త గినంత నీరు తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. మెడికవర్ సెంటర్ ఇంచార్జ్ గుర్రం కిరణ్‌ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో కార్డియాలజిస్టులు డాక్టర్ అనీష్ పబ్బ, అనెస్థీషియా హెడ్ డాక్టర్ వినయ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు.