calender_icon.png 25 January, 2026 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం

24-01-2026 12:00:00 AM

అలంపూర్, జనవరి 23: మానవపాడు మండల పరిధిలోని కొర్విపాడు గ్రామంలో శుక్రవారం ఉచిత పశు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరాన్ని పశువైద్యాధికారులు ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి జిల్లా పశువైద్యాధికారి డా. శివానంద స్వామి హాజరై మాట్లాడారు. ఈ శిబిరంలో పశువుల చెవులు పరీక్ష, గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స అందించడం గురించి ప్రజలకు వివరించారు. అలాగే లేగ దూడల నట్టల నివారణ మందులు తాగించారు. చలికాలంలో పశువులకు వచ్చే రోగాల గురించి వివరించి తగు జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు డాక్టర్. పుష్పలత ,హరిప్రియ, విఎ బీసన్న, సూర్య రెడ్డి, గోపాలమిత్రలు, కావేరి అయ్యన్న, పరుశురాం గ్రామస్తులు పాల్గొన్నారు.