03-07-2025 12:58:48 AM
- సమావేశంలో కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేల సూచనలు
ఆదిలాబాద్, జూలై 2 (విజయక్రాంతి): నూతనంగా ఎంపికైన ఎస్సీ,ఎస్టీ కమిటి సభ్యులు చురుగ్గా పనిచేస్తు, ఎస్సీ ఎస్టీ చట్టాల పై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి విభాగం PCR చట్టం 1955 & (POA) చట్టం 1989 అమలును సమీక్షించడానికి జిల్లా స్థాయి నిఘా అండ్ పర్యవేక్షణ కమిటీ సమావేశం బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ల తో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాక్ట్ పై నూతన కమిటి సభ్యులకు పలు సూచనలు చేశారు. బాధితులకు చెల్లించాల్సిన పరిహారం వివరాల పై సమీక్షించారు. అంతకుముందు షెడ్యూల్డు కులాల అధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టంలో ఉన్న విధి విధానాల పై వివరించారు. అదేవిధంగా కమిటీ సభ్యునిగా ఎన్నికైన శశికాంత్ కు నియామాక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... కొత్తగా ఎన్నికైన సభ్యుల కాలం రెండు సంవత్సరాలు ఉంటుందని, నిరంతరం ప్రతీ రోజూ గ్రామాల్లో పర్యటించి ఎస్సీ,ఎస్టీ లకు సమాజానికి మంచి చేసేలా కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్లాలని ఆన్నారు. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని, సబ్ కలెక్టర్ యువరాజ్, అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు .