03-07-2025 01:00:29 AM
-ఎస్పీ జి. జానకి షర్మిల
భైంసా, జూలై 2 (విజయక్రాంతి): భైంసా లోని క్యాంపు కార్యాలయంలో, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు,ని త్యం పోలీసులు నిర్వహించే బ్లూ కోర్టు, 100 డయల్ స్పందన, ట్రాఫిక్ చలాన్ల జారీ, రాత్రిపూట తిరిగే నేర అనుమానితుల ధృవీకరణ వంటి కార్యక్రమాల్లో మరింత సమ ర్థవంతంగా ఉపయోగించే సరికొత్త ఆధునికత తో కూడిన ట్యాబ్ లను మరియు కొత్త కెమెరాలను జిల్లా ఎస్పీ డా: జి. జానకి షర్మి ల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నేటి యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రతి రంగాన్ని ఆధిపత్యంగా మారుస్తోంది. ముఖ్యంగా ప్రజల భద్రతకు నిత్యం పనిచేస్తున్న పోలీస్ విభాగం కూడా ఈ మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ట్యాబ్లు అందించడం ద్వారా, విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని తక్షణమే పొందే అవకాశం లభిస్తుంది.
బాధితుల సమాచార నమోదు, సంఘటన స్థలానికి సమీప పోలీ సు బృందాన్ని గుర్తించడం వంటి అనేక కార్యకలాపాలు ఇప్పుడు మరింత వేగవంతంగా, ఖచ్చితంగా నిర్వహించబడతాయి. అంతేకాకుండా బ్లూ కోర్ట్ టీమ్లు తమ నియమిత పనులను ట్యాబ్ల సహాయంతో రికార్డు చేయడం, సమయానుగుణంగా నివేదికలు పంపడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇది పోలీస్ శాఖను డిజిటల్ దిశగా ముందు కు నడిపే చారిత్రక ముందడుగు అని చెప్పవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.