1 July, 2026 | 5:11 AM

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి

13-06-2024 12:31 AM

సిద్దిపేట అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్

సిద్దిపేటరూరల్, జూన్ 12: వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం వైద్యాధికారుల, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులతో ఆమె జూమ్ మీటింగ్ నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమా లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తాగునీటి పైపులైన్లు లీకేజీ కాకుండా, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు.

ప్రతి ఫ్రైడే డ్రై డే నిర్వహిం చాలని సూచించారు. ఈ విషయమై గురువారం మున్సిపల్, మండల, గ్రామ స్థాయిలో అధికారులతో సమావేశం నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, డీపీవో దేవకీదేవి, జెడ్పీ సీఈవో రమేశ్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు కాశీనాథ్, శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్లు విజయరాణి, రజిని, ఎంపీడీవోలు పాల్గొన్నారు.