1 July, 2026 | 6:10 AM

రోగులకు మెరుగైన సేవలందించాలి

13-06-2024 12:29 AM

జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ 

వైద్యాధికారుల తీరుపై ఆగ్రహం

జహీరాబాద్, జూన్ 12: జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యాధికారులు 24 గంటల పాటు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ఆదేశించారు. బుధవారం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. వైద్యాధికారులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీ లించారు. వైద్యాధికారులు సమయపాలన పాటించకపోవడంతో పాటు అనధికారికం గా సెలవులు పెడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ సక్రమంగా పర్యవేక్షించకపోవడంపై మండిపడ్డారు. వైద్యాధికారుల తీరుపై కలెక్ట ర్ వల్లూరు క్రాంతి, జిల్లా వైద్యాధికారి గాయ త్రి దేవికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆసుపత్రి పరిసర ప్రాంతాలు, వార్డులు, డయాలసిస్ సెంటర్లను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశమై వాన కాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.